పీఏసీ పదవిపై టీడిపీ లో నెలకొన్న విభేదాలు || TDP Selects Payyavula Keshav For PAC Chairman Post

2019-07-25 828

It is reported that seniors are unhappy with TDP President Chandrababu Naidu's decision to give Udayakonda MLA Keshav a chance at Anantapur district as chairman of the Public Accounts Committee (PAC). Buchanayya Chowdhury seems to have been angry at Chandrababu's decision. It is reported that Keshav has expressed his displeasure to all his close associates who have used him in the legislature.
#appolitics
#oppositionparty
#payyavulakeshav
#ysrcp
#tdp
#achamnayudu
#buchaiahchowdary
#ganababu
#gantasrinivas

ఏమీ లేని పార్టీలోనే అన్నీ కావాలనుకుంటారు. ఏపీలో అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో పదవులు తీవ్ర చిచ్చు పెడుతున్నాయి. ఉన్న నలుగురు నేతల మద్య వివాదాన్ని రగిలిస్తోంది ఓ పదవి. సహజంగా ప్రతిపక్ష పార్టీ సభ్యులను వరించే పబ్లిక్ అకౌంట్స్ పదవి తెలుగుతమ్ముళ్లల్లో మనస్పర్థలను రగిలించింది. ఆ పదవిపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు కాస్త అసంతృప్తి ఎదురైంది. పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ పదవి ఆశించి భంగపడ్డ నేతలు పయ్యావుల కేశవ్ పైన, పార్టీ అధినేత పైన కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించడంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్టు వెల్లడవుతోంది.